నకిలీ పాస్‌పోర్టుతో కేరళవాసి అరెస్టు | Kerala man held with fake passport at shamshabad airport | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్‌పోర్టుతో కేరళవాసి అరెస్టు

Feb 6 2014 9:57 PM | Updated on Sep 2 2017 3:24 AM

నకిలీ పాస్‌పోర్టుతో మస్కట్ నుంచి వచ్చిన ఓ కేరళవాసిని ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు.

శంషాబాద్: నకిలీ పాస్‌పోర్టుతో మస్కట్ నుంచి వచ్చిన ఓ కేరళవాసిని ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన ఇషాక్ మహమూద్(27) కొన్నేళ్ల కిందట ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ యజమాని పాస్‌పోర్టు తీసుకోవడంతో నకిలీపాస్ పోర్టుతో మస్కట్ వెళ్లాడు. గురువారం సాయంత్రం మణికంఠ పేరుతో ఉన్న నకిలీ పాస్‌పోర్టుతో హైదరాబాద్ వచ్చిన అతడిని ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement