పాలకొల్లు వద్ద భారీగా ట్రాఫిక్ జాం | Heavy traffic in Palakollu route | Sakshi
Sakshi News home page

పాలకొల్లు వద్ద భారీగా ట్రాఫిక్ జాం

Jul 18 2015 3:19 PM | Updated on Sep 3 2017 5:45 AM

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు- నరసాపురం మధ్య హైవేపై పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి.

పాలకొల్లు (పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు- నరసాపురం మధ్య హైవేపై పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి. ఉదయం కొన్ని గంటలపాటు వాహనదారులు ఇదే రహదారిలో ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 1.30గంటల నుంచి మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది. నరసాపురం, అంతర్వేది, అప్పనపల్లి వైపు పుష్కరస్నానాలకు వెళ్లే భక్తులు పెద్ద ఎత్తున ఒకేసారి తరలిరావటంతో ఈ పరిస్థితి తలెత్తింది. పోలీసులు రంగప్రవేశం చేసినా పెద్దగా ప్రభావం కనిపించటంలేదు. దాదాపు పదికిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement