యువతిపై సామూహిక అత్యాచారయత్నం | Gang Rape Attempt on woman In West Godavari district | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక అత్యాచారయత్నం

Mar 18 2014 9:46 AM | Updated on Jul 28 2018 8:51 PM

యువతిపై సామూహిక అత్యాచారయత్నం - Sakshi

యువతిపై సామూహిక అత్యాచారయత్నం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని పశువుల ఆసుపత్రి వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి యత్నించారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని పశువుల ఆసుపత్రి వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి యత్నించారు. దాంతో యువతి గట్టిగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి యువతిని యువకుల వద్ద నుంచి కాపాడే ప్రయత్నం చేశారు.ఆ క్రమంలో సదరు యువతికి తీవ్ర గాయాలయ్యాయి.

 

అత్యాచారానికి యత్నించిన యువకులపై  స్థానికలు గట్టిగా ఎదురు దాడికి దిగారు. దాంతో యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువతిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement