మాజీ సీఎం కిరణ్ తో కిషన్ రెడ్డి భేటి! | G.Kishan Reddy met former CM Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కిరణ్ తో కిషన్ రెడ్డి భేటి!

Jun 26 2014 7:41 PM | Updated on Jul 29 2019 5:31 PM

మాజీ సీఎం కిరణ్ తో కిషన్ రెడ్డి భేటి! - Sakshi

మాజీ సీఎం కిరణ్ తో కిషన్ రెడ్డి భేటి!

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో రాజకీయాలు మాట్లాడలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి మీడియాకు వెళ్లడించారు.

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో రాజకీయాలు మాట్లాడలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి మీడియాకు వెళ్లడించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కిషన్ రెడ్డి సమావేశమవ్వడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్దిరోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. 
 
కేంద్ర నామినేటెడ్ పోస్టుల విషయంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని త్వరలో పార్టీ నాయకత్వాన్ని కలుస్తామని ఓ ప్రశ్నకు జవాబిచ్చింది.  మెదక్ ఎంపీ అభ్యర్థి విషయంలో రాష్ట్ర పార్టీ ఇంకా చర్చించలేదని కిషన్ రెడ్డి మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement