లయన్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం | free medical camp in kurnool district | Sakshi
Sakshi News home page

లయన్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

Jul 26 2015 2:55 PM | Updated on Sep 3 2017 6:13 AM

లయన్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

లయన్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో ఆదివారం నంద్యాల లయన్‌క్లబ్, కిమ్స్(సికింద్రాబాద్)వారి సహకారంతో లయన్‌క్లబ్(బేతంచర్ల) ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించింది.

బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో ఆదివారం నంద్యాల లయన్‌క్లబ్, కిమ్స్(సికింద్రాబాద్)వారి సహకారంతో లయన్‌క్లబ్(బేతంచర్ల) ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించింది. ఈ వైద్యశిబిరాన్ని అనంతపురం జిల్లా గుత్తి కోర్టు సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వైద్యశిబిరానికి పట్టణంలోని 300 మంది రోగులు వచ్చి చికిత్స తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు రోగులకు మందులు అందజేశారు. అట్టడగువర్గాల వారు ఇటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని లయన్‌క్లబ్ నిర్వాహకులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement