ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మహత్య | farmer suicide in prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మహత్య

Oct 23 2015 10:17 AM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధతో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు.

కురిచేడు:  అప్పుల బాధతో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన బొల్లేపల్లి శ్రీనివాసరావుకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత కొన్నేళ్లుగా సాగులో సరైన దిగుబడి లేకపోవడంతో చేసిన అప్పులు రూ.6 లక్షలకు పెరిగాయి. దీంతో అవి తీర్చడం కష్టం అవడంతో మనస్థాపం చెందిన  శ్రీనివాసరావు గురువారం అర్ధరాత్రి ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement