ఏసీబీకి చిక్కిన ఉపాధికల్పన శాఖ అధికారి | Employment officer caught by ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఉపాధికల్పన శాఖ అధికారి

Mar 15 2016 3:49 PM | Updated on Aug 17 2018 12:56 PM

స్టీల్‌ప్లాంట్ భూ నిర్వాసితుడి నుంచి లంచం తీసుకుంటూ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ అధికారి ఒకరు ఏసీబీకి చిక్కారు.

స్టీల్‌ప్లాంట్ భూ నిర్వాసితుడి నుంచి లంచం తీసుకుంటూ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ అధికారి ఒకరు ఏసీబీకి చిక్కారు. వివరాలివీ... విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి రామయ్యకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆర్.కార్డు ఇచ్చింది. ఈ కార్డు ద్వారా ఆయన ఉక్కు కర్మాగారం నుంచి ప్రయోజనం పొందే వీలుంటుంది.

ఈ కార్డులో పేరు మార్చాలని రామయ్య కొద్దిరోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, ఆ పని చేసేందుకు జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ అధికారి సతీష్‌కుమార్ రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. దీనిపై రామయ్య ఏసీబీకి ఉప్పందించారు. వారి సూచనల మేరకు మంగళవారం మధ్యాహ్నం సతీష్‌కుమార్‌కు లంచం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement