అసభ్యకర వీడియో చిత్రీకరణ.. వ్యక్తికి దేహశుద్ది

Eluru Government Hospital Women Security Attack On Man - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : తమకు తెలియకుండా అసభ్యకర వీడియో చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి మహిళా సెక్యూరిటీ సిబ్బంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా సెక్యూరిటీ సిబ్బందికి తెలియకుండా చాటుగా ఓ వ్యక్తి వారిని వీడియో తీస్తున్నాడు. అది గమనించిన ఓ మహిళా సెక్యూరిటీ.. మిగితా సిబ్బందికి తెలియజేశారు. ఇంతలోనే ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశారు. పరుగెత్తి పట్టుకున్న సిబ్బంది ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అతని ఫోన్‌లో ఉన్న వీడియోని డిలీట్‌ చేసి పోలీసులకు అప్పగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top