హోంగార్డుకు ఆర్థిక సాయం | Economic aid to the Home Guard | Sakshi
Sakshi News home page

హోంగార్డుకు ఆర్థిక సాయం

Apr 28 2018 12:28 PM | Updated on Apr 28 2018 12:28 PM

Economic aid to the Home Guard - Sakshi

అప్పారావుకు ఆర్థికసాయం అందజేస్తున్న ఎస్పీ పాలరాజు 

విజయనగరం టౌన్‌ : జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కోరాడ అప్పారావుకు ఎస్పీ జి. పాలరాజు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల చెక్‌ను అందజేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ,  హోంగార్డులు పదవీ విరమణ చేసినా, మరణించినా వారి కుటుంబానికి హోంగార్డుల ఒక్కరోజు అలవెన్స్‌ను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో హోమ్‌గార్డ్స్‌ ఇన్‌చార్జి ఆర్‌ఎస్సై మురళీధర్, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ బి.చంద్రశేఖర్, జూనియర్‌ సహాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement