ఎమ్మెల్యే బొండా సంచలన వ్యాఖ్యలు | bonda umamaheswara rao sensational comments over cabinet reshuffle | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే బొండా సంచలన వ్యాఖ్యలు

Apr 2 2017 5:00 PM | Updated on Jun 2 2018 7:14 PM

ఎమ్మెల్యే బొండా సంచలన వ్యాఖ్యలు - Sakshi

ఎమ్మెల్యే బొండా సంచలన వ్యాఖ్యలు

తనకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారంటూ విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: తనకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారంటూ విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్టు జరగవని వ్యాఖ్యానించారు. కాపులకు అన్యాయం జరగడం తొలిసారి కాదని, మాకు కామనైపోయిందంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. సీఎం ఎటువంటి హామీఇవ్వలేదని, అయినప్పటికీ ఆయన చెప్పినట్టే నడుచుకుంటానని చెప్పారు.

తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు 13 జిల్లాల టీడీపీ కార్యకర్తలు బాధ పడ్డారని పేర్కొన్నారు. కొత్త, పాత కలయికలో మంత్రివర్గం ఉందన్నారు. కొత్తవారికి చోటు కోసం నాలాంటి కొందరు త్యాగం చేయాల్సివచ్చిందని వాపోయారు. అయితే ఎమ్మెల్యే బొండాకు కేబినెట్ పదవి రాకుండా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బొండా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement