పందెం కోళ్లు కాదు..! | Bet is not chickens! | Sakshi
Sakshi News home page

పందెం కోళ్లు కాదు..!

Jan 13 2016 1:59 AM | Updated on Jul 6 2018 3:32 PM

పందెం కోళ్లు కాదు..! - Sakshi

పందెం కోళ్లు కాదు..!

కరంపూడిలోని పశు వైద్యశాలలో మంగళవారం సంక్రాంతి సంబరాల సందర్భంగా కోళ్ల ప్రదర్శనకు వచ్చిన పుంజులివి.

కారంపూడి: కరంపూడిలోని పశు వైద్యశాలలో మంగళవారం సంక్రాంతి సంబరాల సందర్భంగా కోళ్ల ప్రదర్శనకు వచ్చిన పుంజులివి. కట్టేసి ఉన్నా కొట్లాటకు దిగాయి. ఈ ఫ్రీ షోను అక్కడున్న వారు సరదాగా తిలకించారు. చారిత్రక పల్నాటి పోతుగడ్డపై సంక్రాంతి సందర్భంగా పశువైద్యశాఖ నిర్వహించిన ప్రదర్శనలో యాదృచ్ఛికంగా ఈ పోరాట దృశ్యాలు కనిపించాయి. జాతి కోళ్లు, విత్తనపు పొట్టేళ్లు, దూడలు, ఆవులు, కోడె దూడలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.

అందంగా ఉన్న వాటికి పశు వైద్యాధికారి పద్మావతి, సర్పంచ్ యేసురత్నం, ఎంపీపీ నాగులునాయక్, తహశీల్దార్ స్వర్ణలతమ్మ, ఎంపీడీవో హీరాలాల్,  ఎంపీటీసీ సభ్యులు బొమ్మిన సావిత్రి అల్లయ్య, ఖాసిమ్, జ్యోతీబాయి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement