ఈ పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ గుర్తున్నాడా?

పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ అమిన్‌ హఫీజ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. గతంలో గేదెను ఇంటర్వ్యూ చేసిన అతను ఇప్పుడు మరో వినూత్న పద్ధతిలో రిపోర్టింగ్‌ చేశాడు. అమిన్‌ హఫీజ్‌ పాకిస్తాన్‌లోని జియో న్యూస్‌ చానల్‌లో ఓ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. అతను చక్రవర్తి వేషం ధరించి చేతిలో కత్తి, మెడపై కిరీటంతో న్యూస్‌ రిపోర్ట్‌ చేశాడు. అతని వెనకాల ఇద్దరు భటులు నిలబడగా తన చేతిలోని కత్తిని తిప్పుతూ ముఖ్యాంశాలను వివరించాడు. ఈ తతంగాన్ని మరో జర్నలిస్టు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. క్షణాల్లో ఇది వైరల్‌గా మారింది. పైగా అతని వినూత్న రిపోర్టింగ్‌ యధాతథంగా టీవీ బులిటెన్‌లో ప్రత్యక్షమైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top