పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. లోక్ సభ సభ్యుడు, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడం సహా పలు అంశాలను విపక్షాలు లేవనెత్తాయి. సభ ప్రారంభం కాగానే, కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రిన్స్ రాజ్(ఎల్జేపీ), హిమాద్రి సింగ్(బీజేపీ), శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్(ఎన్సీపీ), డీఎం కాతిర్ ఆనంద్(డీఎంకే) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, ఇటీవల మృతి చెందిన మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్ జెఠ్మలానీ సహా 10 మంది పార్లమెంటు సభ్యులకు నివాళులర్పించారు. ఆ వెంటనే, కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆపేయాలని నినాదాలు చేశారు.
తొలిరోజే లోక్‌సభలో గందరగోళం
Nov 19 2019 8:32 AM | Updated on Nov 19 2019 8:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement