కార్చిచ్చు దాటికి బుగ్గిపాలవుతున్న ‘అమెజాన్‌’ | The Amazon rainforest is on fire | Sakshi
Sakshi News home page

కార్చిచ్చు దాటికి బుగ్గిపాలవుతున్న ‘అమెజాన్‌’

Aug 22 2019 3:56 PM | Updated on Aug 22 2019 4:01 PM

ప్రపంచంలోనే అత్యధిక పొడవైన వర్షాధార ఉష్ణమండల అడవి(రెయిన్‌ఫారెస్ట్‌)గా ప్రసిద్ధికెక్కిన అమెజాన్‌లో కార్చిచ్చు రగులుతోంది. ఈ అడవిలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. గత కొన్నాళ్లుగా మంటల ధాటికి ఈ అడవిలోని చెట్లన్నీ కాలి బూడిద అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్‌లో దాదాపు 73 వేల అగ్ని ప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎన్‌పీఈ వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో(2013-2018) వీటి సంఖ్య 83 శాతం పెరిగిందని పేర్కొంది. దీంతో దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ అలుముకుందని తెలిపింది. బ్రెజిల్‌పై ఈ మంటల ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ముఖ్యంగా అమెజానస్‌, రోండోనియా రాష్ట్రాల్లో పూర్తిగా పొగ అలుముకుందని వెల్లడించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement