బాలికను నమ్మించి గర్భవతిని చేసిన టీచర్‌

ఏలూరు నగరంలో ఒక మైనర్‌ బాలికను మాయమాటలతో లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేసిన కీచక టీచర్‌ ఉదంతం మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. రోడ్డుపై నగ్నం నడిపిస్తూ.. చితకొట్టి ఏలూరు టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలిక తల్లీదండ్రీ ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక ఏలూరు టూటౌన్‌ ప్రాంతంలోని ఒక పాఠశాలలో చదివే సమయంలో అక్కడ ఇంగ్లిష్‌ టీచర్‌గా కె.రాంబాబు పనిచేశాడు. అప్పట్లో మార్కులు బాగా వేయిస్తానని నమ్మబలికి బాలికను లోబరుచుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top