బంజారాహిల్స్‌లో వ్యభిచార గృహంపై దాడి | Police Bust Two Houses In Banjara Hills, More Details Inside | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో వ్యభిచార గృహంపై దాడి

Jun 12 2025 9:05 AM | Updated on Jun 12 2025 10:42 AM

Police Bust Two Houses In Banjara Hills

హైదరాబాద్: బంజారాహిల్స్‌ పోలీసులతో కలిసి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఇద్దరు హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. మరో నలుగురు మహిళలను రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–12లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బంజారాహిల్స్‌ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహం నిర్వాహకుడు అనంతపురం జిల్లా కేశవరాయనిపేటకు చెందిన కుమ్మెత నరేందర్‌రెడ్డి, హౌస్‌ కీపింగ్‌ విధులు నిర్వర్తించే బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఆనంద్‌కుమార్, రాహుల్‌కుమార్‌లతో పాటు ముగ్గురు కస్టమర్లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నలుగురు మహిళలను రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. వీరి నుంచి రూ.26,500 నగదు, ఏడు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement