కాగజ్‌నగర్‌ కాటన్‌ మిల్లులో అగ్ని ప్రమాదం  | Massive Fire Broke Out In Kagaznagar Cotton Mill | Sakshi
Sakshi News home page

కాగజ్‌నగర్‌ కాటన్‌ మిల్లులో అగ్ని ప్రమాదం 

Jan 13 2024 2:25 AM | Updated on Jan 13 2024 2:25 AM

Massive Fire Broke Out In Kagaznagar Cotton Mill - Sakshi

రెబ్బెన(ఆసిఫాబాద్‌): కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్‌ కాటన్‌ మిల్లులో శుక్రవా రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.2 కోట్ల విలువైన పత్తి అగ్నికి ఆహుతైంది. ఈ ఘనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యా హ్నం తర్వాత మిల్లులోకి పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ చేసే క్రమంలో నిప్పురవ్వలు చెలరేగాయి.

క్షణాల్లోనే మిల్లు ఆవరణలో ఉన్న పత్తితో పాటు బేళ్లకు అంటుకోవటంతో పెద్దమొత్తంలో మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్న వారు వెంటనే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ పట్టణాల్లోని ఫైరింజన్లకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అప్పటికే 2,300 క్వింటాళ్ల పత్తితోపాటు, 94 పత్తి బేళ్లు కాలిపోయాయని మిల్లు నిర్వాహకులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement