అందం.. సామాజిక బంధం | Hyderabad To Host Miss World Pageant From May 7 And May 31, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Miss World 2025: అందం.. సామాజిక బంధం

May 6 2025 6:20 AM | Updated on May 6 2025 12:45 PM

Hyderabad to host Miss World pageant from May 7 and May 31

ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్న మిస్‌ వరల్డ్‌ అందాల భామలు

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ వరల్డ్‌ కిరీటం కోసం పోటీపడనున్న సుందరీమణులు సౌందర్యోపాసనకే పరిమితం కావడంలేదు. భావి ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నారు. వారిలో ఎందరో వైద్యులు, దౌత్యవేత్తలు, డిజైనర్లు, పైలట్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎంచుకున్న రంగంలో బిజీగా ఉంటూనే మిస్‌ వరల్డ్‌ కిరీటం సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. మిస్‌ వరల్డ్‌ 72వ ఎడిషన్‌ కోసం హైదరాబాద్‌ వస్తున్న 110 దేశాల సుందరీమణులు వృత్తి–ప్రవృత్తి పరంగా భిన్న రంగాల్లో ప్రావీణ్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. 

సమాజానికి మంచి చేసేందుకు.. 
పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్‌ ఇండియా నందినీ గుప్తా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చదువుతోంది. రాజస్తాన్‌లోని కోటా నగరానికి చెందిన ఆమె 2023లో ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకుంది. భవిష్యత్తు వాణిజ్య సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని తపిస్తూనే ‘ప్రాజెక్ట్‌ ఏకతా‘ద్వారా వికలాంగులకు మంచి జీవితం అందించేందుకు కృషి చేస్తోంది. 

⇒ మిస్‌ నమీబియా సెల్మా కమన్య ఓ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త. నమీబియాలో మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తోంది. 
⇒  టర్కీ సుందరీమణి ఇడిల్‌ బిల్జెన్, ఉక్రెయిన్‌లో యుద్ధ బాధితులకు చికిత్స చేస్తూ సామాజిక సేవారంగంలో ముందుకు సాగుతున్నారు. 
⇒ ఫ్రాన్స్‌ సుందరి అగాథే కాయెట్, నార్తర్న్‌ ఐర్లాండ్‌కు చెందిన హన్నా జాన్సన్, గయానాకు చెందిన జలికా సామ్యూల్స్‌ వైద్యులకు అండగా ఆసుపత్రుల్లో రోగులకు సేవలందిస్తున్నారు. 

⇒  నేపాల్‌ భామ స్రీచ్చా ప్రధాన్‌ పర్యావరణం మెరుగుపరిచేందుకు పనిచేస్తోంది. 
⇒ కిర్గిజ్‌స్తాన్‌కు చెందిన ఐజాన్‌ చనచేవా, సెర్బియా సుందరి అలెగ్జాండ్రా రుటోవిక్‌ హోటల్‌ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. 
⇒  మిస్‌ కొలంబియా కాటలినా క్వింటెరో  వ్యాపారంపై దృష్టి పెట్టింది. 

⇒ అంగోలాకు చెందిన నూరియా అస్సిస్, వ్యాపారం, మార్కెటింగ్‌లో డిగ్రీలు కలిగిన పాప్‌ స్టార్‌ గాయని. బీట్‌లను బోర్డ్‌ రూమ్‌లతో మిళితం చేస్తూ ముందుకు సాగుతున్నారు.  
⇒ ఫిన్లాండ్‌ నుంచి పోటీలో నిలిచిన సోఫియా సింగ్‌ పీఆర్, మార్కెటింగ్‌ నిపుణురాలు. 
⇒  మిస్‌ హంగరీ ఆండ్రియా కాట్జెన్‌బాచ్‌ మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌లను నైపుణ్యంతో సమన్వయం చేçస్తున్నారు. 
⇒  గ్రీస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టెల్లా మిచైలిడౌ, హైతీకి చెందిన క్రిస్టీ గురాండ్, మిస్‌ వియత్నాం హుయిన్‌ ట్రాన్‌యినీ భవిష్యత్తులో గొప్ప వ్యాపార సంస్థలకు సీఈఓలు అయ్యేందుకు బాటలు వేసుకుంటున్నారు. 

⇒  దక్షిణాఫ్రికాకు చెందిన జోలైజ్‌ జాన్సెన్‌ వాన్‌ రెసబర్గ్‌ కేవలం 18 ఏళ్ల వయసులోనే డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ప్రొఫెషనల్‌ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. 
⇒ థాయిలాండ్‌ సుందరి ఓపల్‌ సుచాట, గ్లోబల్‌ అఫైర్స్‌ గ్రాడ్యుయేట్‌. ఆగ్నేయాసియా దేశాల మధ్య సంబంధాలపై అధ్యయనం చేస్తున్నారు. 
⇒  మిస్‌ శ్రీలంక అనుది గుణసేకర, మిస్‌ కొరియా మిన్‌ జంగ్, పనామాకు చెందిన కరోల్‌ రోడ్రిగెజ్‌లు కూడా అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై అధ్యయనంలో బిజీగా ఉన్నారు. 

⇒ కేమన్‌ ఐలాండ్స్‌కు చెందిన జాడా రమూన్‌ తన స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో కలిసి పనిచేçస్తున్నారు. 
⇒ గ్వాడెలూప్‌నకు చెందిన నోమీ మిల్నే వైద్యురాలిగా రాణిస్తూనే రచయిత్రిగా కూడా ప్రతిభ చాటుకుంటున్నారు. 
⇒ వేల్స్‌కు చెందిన మిల్లీ–మే ఆడమ్స్, బోస్నియాకు చెందిన ఎనా అడ్రోవిక్‌ వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. 
⇒ ప్యూర్టోరికోకు చెందిన వలేరియా పెరెజ్‌ మెడికల్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ గ్రాడ్యుయేట్‌. 

⇒ బెల్జియంకు చెందిన కరెన్‌ జాన్సెన్, గ్వాటెమాలా నుంచి పోటీపడుతున్న జైమీ ఎస్కోబెడో, లెబనాన్‌కు చెందిన నాదా కౌస్సా, మలేసియాకు చెందిన సరూప్‌ రోషి, పోలాండ్‌కు చెందిన మాజా క్లాజ్డాలు మానసిక వైద్యులుగా ఎదిగేందుకు కసరత్తు చేస్తున్నారు. 
⇒ ఇంగ్లాండ్‌కు చెందిన మిల్లా మాగీ లైఫ్‌గార్డ్, సీపీఆర్‌ ప్రచారకర్త. 
⇒ బ్రెజిల్‌కు చెందిన జెస్సికా పెడ్రోసో, అర్జెంటీనాకు చెందిన గ్వాడలూపే అలోమర్, ఆ్రస్టేలియా ప్రతినిధి జాస్మిన్‌ స్ట్రింగర్‌లు ఉపాధ్యాయ వృత్తిలో ముందుకు సాగుతున్నారు. 

⇒  మెక్సికో భామ మేరిలీ లీల్‌ విద్యా కార్యక్రమాలను నడుపుతున్నారు. 
⇒  చిలీకి చెందిన ఫ్రాన్సిస్కా లవాండెరో కమర్షియల్‌ పైలట్‌గా రాణిస్తుండగా సొమాలియాకు చెందిన జైనబ్‌ జమా ఏవియేషన్‌ అధ్యయనంలో ఉన్నారు. 
⇒ అర్మేనియా సుందరి అడ్రిన్‌ అట్షెమ్యాన్‌ అర్మేనియా టీవీలో ప్రసారమయ్యే అత్యధిక రేటింగ్‌ టీవీ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి. 
⇒ అమెరికా తరఫున పోటీలో ఉన్న అథెన్నా క్రాస్బీ టీవీ తెరను ఏలుతోంది. 
⇒ డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన మైరా డెల్గాడో స్వదేశంతోపాటు అమెరికా, ఇత ర లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో యూనివిజన్‌ కోసం రిపోర్టర్‌గా పనిచేస్తోంది. 
⇒ ఎస్టోనియాకు చెందిన ఎలీస్‌ రాండ్‌మా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఎదుగుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement