చిట్యాలలో ఎలుగుబంటి హల్‌చల్‌ | Bear Hulchul In Chityala Village | Sakshi
Sakshi News home page

చిట్యాలలో ఎలుగుబంటి హల్‌చల్‌

May 15 2021 2:18 PM | Updated on May 15 2021 2:56 PM

Bear Hulchul In Chityala Village - Sakshi

తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి నీటి కోసం గ్రామ శివారులోకి రాగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.

సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి నీటి కోసం గ్రామ శివారులోకి రాగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్తులు ఎలుగుబంటిని తరిమికొట్టగా గ్రామ శివారులో గల నీళ్లు లేని బావిలో పడింది. దాంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా వలల సహాయంతో ఎలుగుబంటిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తుల అరుపులు కేకలతో ఓ సందర్బంలో దాడి చేయడానికి ఎలుగుబంటి ప్రయత్నించి అడవిలోకి పారిపోయింది.

చదవండి: విచిత్ర సంఘటన.. డ్రైవర్‌గా మారిన పెళ్లికొడుకు 
మంచె మీదే బీటెక్‌ విద్యార్థి ఐసోలేషన్‌.. చెట్టుమీదే 

Advertisement
 
Advertisement
Advertisement