అండర్‌–9 జాతీయ చెస్‌ విజేత నిధీశ్‌ | Under 9 National Chess Champion Nidhish | Sakshi
Sakshi News home page

అండర్‌–9 జాతీయ చెస్‌ విజేత నిధీశ్‌

Jan 3 2025 3:52 AM | Updated on Jan 3 2025 3:52 AM

Under 9 National Chess Champion Nidhish

దివిత్‌ రెడ్డికి మూడో స్థానం

పుణే: జాతీయ అండర్‌–9 చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ చిన్నారులు నిదీశ్‌ శ్యామల్, అదుళ్ల దివిత్‌ రెడ్డి అదరగొట్టారు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో ఓపెన్‌ విభాగంలో నిధీశ్‌ చాంపియన్‌గా అవతరించగా... దివిత్‌ రెడ్డి మూడో స్థానాన్ని సంపాదించాడు. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో నిదీశ్, ఆరిత్‌ కపిల్‌ (ఢిల్లీ) 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... నిదీశ్‌కు టైటిల్‌ ఖరారైంది. 

ఆరిత్‌ రన్నరప్‌గా నిలిచాడు. 9 పాయింట్లతో దివిత్‌ రెడ్డి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది వరల్డ్‌ క్యాడెట్‌ అండర్‌–8 చాంపియన్‌షిప్‌లో దివిత్‌ రెడ్డి స్వర్ణ పతకం గెలిచాడు. విజేతగా నిలిచిన ని«దీశ్‌కు విన్నర్స్‌ ట్రోఫీతోపాటు రూ. 50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. 

హైదరాబాద్‌లోని మ్యాస్ట్రో చెస్‌ అకాడమీలో క్యాండిడేట్‌ మాస్టర్‌ (సీఎం) అమిత్‌పాల్‌ సింగ్‌ వద్ద నిదీశ్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయ చాంపియన్‌ హోదాలో నిదీశ్‌ ఈ ఏడాది జరిగే ప్రపంచ, ఆసియా అండర్‌–9 చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు.  

 

Advertisement
 
Advertisement
Advertisement