ఇవే ప్రపంచకప్‌ మస్కట్‌లు!  | These are the World Cup mascots | Sakshi
Sakshi News home page

ఇవే ప్రపంచకప్‌ మస్కట్‌లు! 

Aug 20 2023 6:01 AM | Updated on Aug 20 2023 6:01 AM

These are the World Cup mascots - Sakshi

దుబాయ్‌: వన్డే వరల్డ్‌ కప్‌ ప్రచార కార్యక్రమాలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఉధృతం చేసింది. ఇందులో భాగంగా టోర్నీ ‘మస్కట్‌’లను ప్రకటించింది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచిన భారత కెప్టెన్లు  షఫాలీ వర్మ, యశ్‌ ధుల్‌ పాల్గొన్నారు.

పురుష క్యారెక్టర్‌ను బ్యాటర్‌గా, మహిళా క్యారెక్టర్‌ను బౌలర్‌గా చూపిస్తూ ఐసీసీ ఒక వీడియో విడుదల చేసింది. అయితే వీటికి అధికారికంగా ఐసీసీ పేర్లు పెట్టలేదు. ఇందుకు అభిమానులు ఆగస్టు 27లోగా ఓటింగ్‌ చేయాలని కోరుతూ ఒక్కో క్యారెక్టర్‌కు 3 ఆప్షన్‌లను ఇచ్చింది. బ్యాటర్‌ మస్క ట్‌ కోసం టాంక్, బాష్, బ్లిట్జ్‌లలో ఒకదానిని, బౌలర్‌ మస్కట్‌ కోసం బ్లేజ్, విక్స్, పైరా అనే పేర్లలో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 5నుంచి భారత్‌లో వరల్డ్‌ కప్‌ జరుగుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement