Australian Open Qualifier: రెండో రౌండ్‌లో సుమిత్‌ నగాల్‌ | Sumit Nagal Advances To Round Two Of Australian Open 2024 Qualifying | Sakshi
Sakshi News home page

Australian Open Qualifier: రెండో రౌండ్‌లో సుమిత్‌ నగాల్‌

Jan 11 2024 7:20 AM | Updated on Jan 11 2024 7:20 AM

Sumit Nagal Advances To Round Two Of Australian Open 2024 Qualifying - Sakshi

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ క్వాలిఫయింగ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ శుభారంభం చేశాడు. మెల్‌బోర్న్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 139వ ర్యాంకర్‌ సుమిత్‌ 6–3, 7–5తో జెఫ్రీ బ్లాన్‌కనెక్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు.

గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో అంకిత రైనా (భారత్‌) 1–6, 5–7తో సారా బెజ్‌లెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement