3 మెయిడిన్లు.. 4 వికెట్లు.. దుమ్మురేపిన తెలుగమ్మాయి | Shree Charani four-fer helps India restrict Zimbabwe at 197 | Sakshi
Sakshi News home page

IND vs ZIM: 3 మెయిడిన్లు.. 4 వికెట్లు.. దుమ్మురేపిన తెలుగమ్మాయి

Oct 23 2026 5:34 PM | Updated on Oct 23 2026 5:49 PM

Shree Charani four-fer helps India restrict Zimbabwe at 197

వ‌డోద‌ర వేదిక‌గా జింబాబ్వే మ‌హిళ‌ల‌తో జ‌రుగుతున్న తొలి తొలి వ‌న్డేలో భార‌త బౌల‌ర్లు చెల‌రేగారు. ఇండియ‌న్ బౌల‌ర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.4 ఓవ‌ర్ల‌లో 197 ప‌రుగులకే ఆలౌటైంది. తెలుగు అమ్మాయి, యువ స్పి‍న్నర్ శ్రీచరణి మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.

చరణి తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ది బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. ఆమె తన 10 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అందులో మూడు మెయిడిన్ ఓవర్లు ఉండడం గమనార్హం. చరణికి వన్డేల్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం. ఆమెతో పాటు క్రాంతి గౌడ్ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. 

ఇక జింబాబ్వే బ్యాటర్లలో బీలవ్డ్ బీజా 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మావుంగా(29), ముపాచిక్వా(25) రాణించారు. కాగా ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

తుది జట్లు
భారత మహిళలు : స్మృతి మంధాన(కెప్టెన్‌), షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్‌కీపర్‌), శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, జింతీమణి కలిత

జింబాబ్వే మహిళలు : బీలవ్డ్ బిజా, షార్నే మేయర్స్, న్యాషా గ్వాన్జురా, మోడెస్టర్ ముపాచిక్వా(వికెట్ కీపర్‌), చిడ్జా ధురురు, చిపో ముగేరి-తిరిపానో, మిచెల్ మవుంగా, నోమ్వెలో సిబాండా(కెప్టెన్‌), టెండై మకుషా, లోరిన్ ఫిరి, ఒలిండర్ చారే
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్ బౌల‌ర్ల గుండెల్లో గుబులు.. టీమిండియాలోకి విధ్వంస‌క‌ర వీరుడు!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement