న్యూజిలాండ్ బౌల‌ర్ల గుండెల్లో గుబులు.. టీమిండియాలోకి విధ్వంస‌క‌ర వీరుడు! | India's Likely Playing XI For 2nd T20I Against New Zealand | Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్ బౌల‌ర్ల గుండెల్లో గుబులు.. టీమిండియాలోకి విధ్వంస‌క‌ర వీరుడు!

Oct 23 2026 5:03 PM | Updated on Oct 23 2026 5:14 PM

India's Likely Playing XI For 2nd T20I Against New Zealand

PC: BCCI/X

క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా న్యజిలాండ్‌తో రెండో టీ20లో త‌ల‌ప‌డేందుకు టీమిండియా సిద్ద‌మైంది. తొలి టీ20లో అద్భుత విజ‌యం సాధించి మంచి జోష్‌లో ఉన్న భార‌త జ‌ట్టు.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొన‌సాగించాల‌ని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.  స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌ గజ్జల్లో గాయం కార‌ణంగా రెండో టీ20కు దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని భార‌త బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ధ్రువీక‌రించాడు.

వైభ‌వ్ ఎంట్రీ? ఫ‌స్ట్ డౌన్‌లో సంజూ
ఇక కిష‌న్ స్దానంలో యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ తుది జ‌ట్టులోకి రావ‌డం ఖాయ‌మైంది. ఒక‌వేళ ఇదే జ‌రిగితే టీమిండియా ఇన్నింగ్స్‌ను అభిషేక్ శ‌ర్మ‌, వైభ‌వ్ సూర్య‌వంశీ ప్రారంభించ‌నుండ‌గా.. సంజూ ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. వైభ‌వ్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నప్ప‌టికి సంజూ, అభిషేక్ నిల‌క‌డ‌గా రాణిస్తుండ‌డంతో అత‌డికి ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్క‌డం లేదు.

వ‌రుస‌గా అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్ సిరీస్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. కానీ ఇప్పుడు ఇషాన్ కిష‌న్ గాయప‌డ‌డంతో తుది జ‌ట్టులోకి వ‌చ్చేందుకు వైభ‌వ్‌కు లైన్ క్లియ‌ర్ అయింది. 15 ఏళ్ల వైభ‌వ్‌కు ఇప్ప‌టికే కివీస్ ఫాస్ట్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్న అనుభ‌వం ఉంది. ఐపీఎల్‌లో మాట్ హెన్రీ, ఫెర్గూస‌న్ వంటి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. ఇప్పుడు వారి సొంత‌గ‌డ్డ‌పై కూడా చుక్క‌లు చూపించాల‌ని వైభ‌వ్ ఉవ్విళ్లూరుతున్నాడు.

ప్రిన్స్ యాద‌వ్‌కు చోటు
అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఓ మార్పు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. మ‌యాంక్ యాద‌వ్ స్ధానంలో ప్రిన్స్‌యాద‌వ్‌ను తీసుకురానున్న‌ట్లు స‌మాచారం. తొలి టీ20లో మయాంక్ ఓ వికెట్ తీసిన‌ప్ప‌టికి త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 40 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగే 2వ టీ20కి భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా): అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్
చదవండి: డబుల్‌ సెంచరీతో చెలరేగిన పాకిస్తాన్‌ ఓపెనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement