Charleston Open: సెమీస్‌లో సానియా జోడి... | Sania Pair Enters Charleston Open Semis Saket Pair In Salinas Open Semis | Sakshi
Sakshi News home page

Charleston Open: సెమీస్‌లో సానియా జోడి...

Apr 9 2022 7:34 AM | Updated on Apr 9 2022 7:37 AM

Sania Pair Enters Charleston Open Semis Saket Pair In Salinas Open Semis - Sakshi

Charleston Open- చార్ల్స్‌టన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ టెన్నిస్‌ టోర్నీలో సానియా మీర్జా (భారత్‌)–లూసీ హర్డెస్కా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. అమెరికాలోని సౌత్‌ కరోలినాలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 3–6, 6–3, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో మూడో సీడ్‌ అలెక్సా గురాచి (చిలీ)–జెస్సికా పెగూలా (అమెరికా) ద్వయంపై గెలిచింది. తొలి రౌండ్‌లో సానియా–హర్డెస్కా 7–5, 7–6 (7/5)తో ఫ్రాన్సెస్కా లొరెంజో–కేటీ వొలినెట్స్‌ (అమెరికా)లపై గెలిచారు.

డబుల్స్‌ సెమీఫైనల్లో సాకేత్‌ జంట 
Salinas Open- సాలినాస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈక్వెడార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–యూకీ ద్వయం 6–3, 6–4తో బెంజమిన్‌ లాక్‌–జాన్‌ లాక్‌ (జింబాబ్వే) జోడీపై గెలిచింది. తొలి రౌండ్‌లో సాకేత్‌–యూకీ జంట 6–3, 7–6 (8/6)తో టాప్‌ సీడ్‌ జీవన్‌ నెడుంజెళియన్‌–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీని ఓడించింది.

 చదవండి: GT Vs PBKS: ఎదురులేని టైటాన్స్‌.. గుజరాత్‌ ‘హ్యాట్రిక్‌’

Advertisement
 
Advertisement
Advertisement