షకీల్‌పై నిషేధం ఎత్తివేత | Pakistan Govt Lifts Two Year Ban On Hockey Captain Ammad Shakeel Butt Amid PHF Crisis, More Details Inside | Sakshi
Sakshi News home page

షకీల్‌పై నిషేధం ఎత్తివేత

Feb 21 2026 8:23 AM | Updated on Feb 21 2026 9:59 AM

Pakistan Hockey captain Ammad Shakeel Butt banned for two years 🇵🇰

లాహోర్‌: పాకిస్తాన్‌ హాకీలో సంక్షోభం ముదురుతున్న వేళ ఆ దేశ సర్కారు జోక్యం చేసుకుంది. పాకిస్తాన్‌ హాకీ జట్టు కెప్టెన్‌ అమద్‌ షకీల్‌ భట్‌పై ఆ దేశ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్‌) విధించిన రెండేళ్ల నిషేధాన్ని పాక్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. 

ఈ నిషేధం నియమావళికి విరుద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఆ్రస్టేలియా పర్యటనలో పీహెచ్‌ఎఫ్‌ నిర్వహణ లోపంతో పాకిస్తాన్‌ హాకీ ఆటగాళ్లు వీధిన పడ్డారు. బసచేస్తున్న హోటల్‌కు నిధులు విడుదల చేయకపోవడంతో ఆటగాళ్లంతా రోడ్లపై పడిగాపులు కాశారు. దీంతో పీహెచ్‌ఎఫ్‌ నిర్వాకంపై కెప్టెన్‌ షకీల్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

దీన్ని సహించలేకపోయిన పీహెచ్‌ఎఫ్‌ అధ్యక్షుడు తారిఖ్‌ బగ్తీ క్రమశిక్షణ చర్యల కింద కెప్టెన్‌పై నిషేధం విధించారు. తర్వాత తన ఆధ్యక్ష పదవికి బగ్తీ రాజీనామా చేశారు. ఆసీస్‌లో పాక్‌ అప్రతిష్టపాలుపై గుర్రుగా ఉన్న పీహెచ్‌ఎఫ్‌ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్, దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌... బగ్తీ రాజీనామాను వెంటనే ఆమోదిస్తూ అహ్మద్‌ అధ్యక్షతన అడ్‌హక్‌ కమిటీని నియమించారు. అలాగే కెపె్టన్‌ షకీల్‌పై నిషేధం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని బగ్తీ విధించిన సస్పెన్షన్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement