సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను వ‌దులుకున్న విలియ‌మ్స‌న్‌.. | New Zealand announce central contracts for 2025-26 season; | Sakshi
Sakshi News home page

NZ Central contracts for 2025-26: సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను వ‌దులుకున్న విలియ‌మ్స‌న్‌..

Jun 3 2025 11:34 AM | Updated on Jun 3 2025 11:34 AM

New Zealand announce central contracts for 2025-26 season;

న్యూజిలాండ్ క్రికెట్ (NZC) 2025-26 సీజన్ కోసం త‌మ‌ ఆట‌గాళ్ల సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాను ప్ర‌క‌టించింది. గ‌తేడాది కివీస్ త‌ర‌పున అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన మిచ్ హే, ముహమ్మద్ అబ్బాస్, జాక్ ఫౌల్క్స్ వంటి యువ ఆట‌గాళ్ల‌కు తొలిసారి సెంట్రాక్ట్ కాంట్రాక్ట్ ద‌క్కింది.

అదేవిధంగా స్పిన్నర్లు ఇష్ సోధి, అజాజ్ పటేల్, ఆల్ రౌండర్ జోష్ క్లార్క్సన్ లను కూడా ఈ జాబితా నుంచి న్యూజిలాండ్ క్రికెట్ తొలిగించింది. కివీస్ వైట్‌బాల్ జ‌ట్టులో సోధి, టెస్టు జ‌ట్టులో ఆజాజ్ ప‌టేల్‌ రెగ్యూల‌ర్ స‌భ్యుల‌గా కొన‌సాగుతున్న‌ప్ప‌టికి వారిని కాంట్రాక్ట్ నుంచి ఎందుకు త‌ప్పించారో స్ప‌ష్ట‌త లేదు. 

మ‌రోవైపు  కేన్ విలియ‌మ్స‌న్‌, డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్‌, టిమ్ సీఫెర్ట్‌, లాకీ ఫెర్గూస‌న్‌లు మ‌రోసారి త‌మ కాంట్రాక్ట్‌ను వ‌దులు కున్నారు. వీరు న‌లుగురు కాంట్రాక్ట్‌లను వ‌దులుకున్న‌ప్ప‌టికి కివీస్ ఆడే ప్ర‌ధాన మ్యాచ్‌లు అన్నింటికీ అందుబాటులో ఉండ‌నున్నారు. విలియ‌మ్స‌న్ గ‌తేడాది కూడా సెంట్రల్ కాంట్రాక్టును తిరస్కరించాడు. 

కానీ న్యూజిలాండ్ ఆడిన మొత్తం 13 మ్యాచ్‌లలో తొమ్మిదింట కేన్ మామ భాగ‌మ‌య్యాడు. అయితే ఫ్రాంచైజీ లీగ్స్‌ల క‌మిట్‌మెంట్ కార‌ణంగా ఈ న‌లుగురు కివీస్ ఆట‌గాళ్లు త‌మ కాంట్రాక్ట్‌ల నుంచి త‌ప్పుకున్నారు. కేన్ ఇప్ప‌టికే ది హండ్రెడ్‌లో లండన్ స్పిరిట్ , కౌంటీ ఛాంపియ‌న్‌షిప్‌, టీ20 బ్లాస్ట్‌లో ఫ్రాంచైజీల‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా
ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విలియం ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విల్ యంగ్
చదవండి: IPL 2025 Final: ఆర్సీబీకి మ‌రో బిగ్ షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన డెంజరస్‌ ప్లేయర్‌?
 

Advertisement
 
Advertisement
Advertisement