చరిత్ర సృష్టించిన షమీ.. తొలి భారత బౌలర్‌గా! అగార్కర్ రికార్డు బద్దలు | Mohammed shami breaks Ajit Agarkar record | Sakshi
Sakshi News home page

IND vs AUS: చరిత్ర సృష్టించిన షమీ.. తొలి భారత బౌలర్‌గా! అగార్కర్ రికార్డు బద్దలు

Sep 23 2023 12:05 PM | Updated on Sep 23 2023 3:41 PM

Mohammed shami breaks Ajit Agarkar record - Sakshi

మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ అదరగొట్టాడు. తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. ఓవరాల్‌గా తన 10 ఓవర్ల కోటాలో 51 పరుగులిచ్చిన షమీ.. 5 వికెట్లు పడగొట్టాడు. షమీకి ఇది తన వన్డే కెరీర్‌లో రెండో ఐదు వికెట్ల హాల్‌ కావడం గమానార్హం.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను షమీ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు. ఇక ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

షమీ సాధించిన రికార్డులు ఇవే..
స్వదేశంలో వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు. షమీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 15 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ పేరిట ఉండేది. జడ్డూ, కుల్దీప్‌ ఇద్దరూ సంయుక్తంగా ఆసీస్‌పై 24 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరి రికార్డును షమీ బ్రేక్‌ చేశాడు.

అదే విధంగా ఓవరాల్‌గా ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. ఇప్పటి వరకు షమీ ఆసీస్‌పై 37 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్‌, ప్రస్తుత ఛీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్(36) రికార్డును షమీ బ్రేక్‌ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌(45) తొలి స్ధానంలో ఉన్నాడు.
చదవండి: వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం.. శంకుస్ధాపన చేయనున్న మోదీ

Advertisement
 
Advertisement
Advertisement