'అత‌డొక సూప‌ర్ స్టార్‌.. గిల్ స్దానంలో బ్యాటింగ్‌కు పంపండి' | Michael Clarke backs Sai Sudharsans Test debut at No 3 for India vs England | Sakshi
Sakshi News home page

IND vs ENG: 'అత‌డొక సూప‌ర్ స్టార్‌.. గిల్ స్దానంలో బ్యాటింగ్‌కు పంపండి'

Jun 7 2025 3:58 PM | Updated on Jun 7 2025 5:33 PM

Michael Clarke backs Sai Sudharsans Test debut at No 3 for India vs England

త‌మిళ‌నాడు యువ సంచ‌ల‌నం సాయిసుద‌ర్శ‌న్ టీమిండియా త‌ర‌పున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. జూన్ 20 నుంచి లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగే తొలి టెస్టులో సుద‌ర్శ‌న్ డెబ్యూ చేయ‌డం దాదాపు ఖాయ‌మైంది. భార‌త జ‌ట్టుతో పాటు లండ‌న్‌కు చేరుకున్న సుద‌ర్శ‌న్ త‌న ప్రాక్టీస్‌ను మొద‌లుపెట్టాడు. 

వ‌న్డే, టీ20ల్లో త‌నకు వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగ‌ప‌రుచుకున్న సుద‌ర్శ‌న్‌..  ఇప్పుడు వైట్‌బాల్ జెర్సీలో భార‌త త‌ర‌పున స‌త్తాచాటాల‌ని భావిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో సుద‌ర్శ‌న్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖ‌ల్ క్లార్క్‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అత‌డొక అద్బుత‌మైన ఆట‌గాడ‌ని, మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాల‌ని క్లార్క్ సూచించాడు.

కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్ర‌క‌టించడంతో కొత్త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. దీంతో గిల్ స్ధానంలో సుద‌ర్శ‌న్ బ్యాటింగ్‌కు రావాల‌ని క్లార్క్‌తో పాటు ప‌లు మాజీలు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

"సాయిసుద‌ర్శ‌న్ ఒక సూప‌ర్ స్టార్‌. అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అత‌డు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా షాట్లు ఆడగ‌ల‌డు. టెస్టు క్రికెట్‌లో అత‌డు నంబ‌ర్ త్రీ స్ధానానికి స‌రిగ్గా స‌రిపోతాడు. అదే వ‌న్డే, టీ20ల్లో అయితే ఓపెన‌ర్‌గా అత‌డు ఇన్నింగ్స్‌ను ప్రారంభించాల‌ని భావిస్తున్నాను. సుద‌ర్శ‌న్ భార‌త టెస్టు సెట‌ప్‌లో భాగంగా ఉన్నాడు. కాబ‌ట్టి అత‌డికి ఇంగ్లండ్‌పై గ‌డ్డ‌పై అరంగేట్రం చేసే అవ‌కాశం లభిస్తుంది" అని క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో క్లార్క్ పేర్కొన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement