గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన పిన్న వయస్కుడిగా...

As a junior defeats a grandmaster - Sakshi

క్లాసికల్‌ చెస్‌ ఫార్మాట్‌లో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి సింగపూర్‌ కుర్రాడు అశ్వథ్‌ కౌశిక్‌ (8 ఏళ్ల 6 నెలల 11 రోజులు) రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్‌లో జరిగిన బర్గ్‌డార్ఫర్‌ స్టాడస్‌ ఓపెన్‌ టోర్నీ నాలుగో రౌండ్‌లో అశ్వథ్‌ 45 ఎత్తుల్లో పోలాండ్‌కు చెందిన 37 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ జేసెక్‌ స్టోపాపై గెలిచాడు. ఈ క్రమంలో లియోనిడ్‌ (సెర్బియా; 8 ఏళ్ల 11 నెలల 7 రోజులు) పేరిట ఉన్న రికార్డును అశ్వథ్‌ బద్దలు కొట్టాడు.
 

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top