Ind Vs WI 1st Test: Rohit Sharma Goes Past ICC No 1 Ranked Kane Williamson - Sakshi
Sakshi News home page

#Rohit Sharma: టెస్టు నంబర్‌ 1 బ్యాటర్‌ను అధిగమించిన రోహిత్‌! అరుదైన జాబితాలో

Jul 13 2023 2:46 PM | Updated on Jul 13 2023 3:50 PM

Ind Vs WI Rohit Sharma Goes Past ICC No1 Ranked Kane Williamson - Sakshi

West Indies vs India, 1st Test- Rohit Sharma: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో తొలి రోజే టీమిండియా పైచేయి సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య జట్టును 150 పరుగులకే ఆలౌట్‌ చేసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదు(5/60) వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

ఇక పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. టీమిండియా బౌలర్ల ధాటికి విలవిల్లాడిన విండీస్‌ బ్యాటర్లు చేతులెత్తేయడంతో 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఓపెనర్ల శుభారంభం
ఈ క్రమంలో ఆట ఆరంభించిన భారత్‌కు తొలిరోజు గంటకు పైగా ఆడే అవకాశం వచ్చింది. అరంగేట్ర ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ 73 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 65 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు స్కోరు చేసింది.

నంబర్‌ 1 టెస్టు బ్యాటర్‌ను అధిగమించి
ఇదిలా ఉంటే.. విండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల వీరుల(యాక్టివ్‌ క్రికెటర్లు) జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌ వెటరన్‌ బ్యాటర్‌, టెస్టుల్లో ప్రస్తుత నెంబర్‌ 1 కేన్‌ విలియమ్సన్‌ను అధిగమించి టాప్‌-5లో చోటు దక్కించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 30 పరుగులు సాధించిన హిట్‌మ్యాన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 17,145* రన్స్‌ పూర్తి చేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల వీరులు(యాక్టివ్‌ క్రికెటర్లు)
1. విరాట్‌ కోహ్లి(ఇండియా)- 25385.
2. క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌)- 19593.
3. జో రూట్‌ (ఇంగ్లండ్‌)- 18336.
4. డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)- 17267.
5. రోహిత్‌ శర్మ(ఇండియా)- 17145*

చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement