హెన్రిచ్‌ ​క్లాసెన్‌ ఊచకోత.. కేవలం 16 బంతుల్లోనే | Heinrich klaasen Hits Fastest Half Century in SA T20 league | Sakshi
Sakshi News home page

Heinrich klaasen: హెన్రిచ్‌ ​క్లాసెన్‌ ఊచకోత.. కేవలం 16 బంతుల్లోనే

Jan 28 2024 9:38 PM | Updated on Jan 29 2024 9:58 AM

Heinrich klaasen Hits Fastest Half Century in SA T20 league - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో భాగంగా పార్ల్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ పార్ల్‌ రాయల్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని క్లాసెన్‌ నమోదు చేశాడు. కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

అతడి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఓవరాల్‌గా 51 పరుగులు చేసి క్లాసెన్‌ ఔటయ్యాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆటగాడు డెవాన్‌ ఫెరీరా పేరిట ఉండేది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ తొలి ఎడిషన్‌లో ఫెరీరా 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో ఫెరీరా రికార్డును క్లాసెన్‌  బ్రేక్‌ చేశాడు.


 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement