ప్రజ్ఞానంద శుభారంభం... వైశాలి ఓటమి | Good start to Pragnananda | Sakshi
Sakshi News home page

ప్రజ్ఞానంద శుభారంభం... వైశాలి ఓటమి

Feb 29 2024 12:04 AM | Updated on Feb 29 2024 12:04 AM

Good start to Pragnananda - Sakshi

భారత చెస్‌ సంచలనం ఆర్‌. ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై తన జోరు కొనసాగిస్తున్నాడు. చెక్‌ రిపబ్లిక్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రేగ్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో అతను విజయంతో మొదలు పెట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ పోరులో ప్రజ్ఞానంద 41 ఎత్తులో జర్మనీ గ్రాండ్‌మాస్టర్‌ విన్సెంట్‌ కీమర్‌ను ఓడించాడు. ఇటాలియన్‌ ఓపెనింగ్‌తో మొదలు పెట్టిన భారత జీఎం అటాకింగ్‌ గేమ్‌ మొదలు కీమర్‌ డిఫెన్స్‌ పని చేయలేదు.

ఈ మ్యాచ్‌ గెలిచే క్రమంలో ప్రజ్ఞానంద ‘లైవ్‌ రేటింగ్‌’లో విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి భారత్‌ తరఫున అత్యధిక రేటింగ్‌ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లలో రిచర్డ్‌ ర్యాపో (రొమానియా)తో జరిగిన గేమ్‌ను డి. గుకేశ్‌...డేవిడ్‌ నవారా (చెక్‌ రిపబ్లిక్‌)తో జరిగిన గేమ్‌ను విదిత్‌ గుజరాతీ ‘డ్రా’ చేసుకున్నారు. చాలెంజర్‌ విభాగంలో అన్‌టోన్‌ కొరొ»ొవ్‌ (ఉక్రెయిన్‌)తో జరిగిన పోరులో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి ఓటమిపాలైంది.   

Advertisement
 
Advertisement
Advertisement