Candidates Chess Tournament: హంపి పరాజయం | Candidates Chess Tournament: Koneru Humpy lose in Round 4 | Sakshi
Sakshi News home page

Candidates Chess Tournament: హంపి పరాజయం

Apr 9 2024 5:21 AM | Updated on Apr 9 2024 5:21 AM

Candidates Chess Tournament: Koneru Humpy lose in Round 4 - Sakshi

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. నాలుగో రౌండ్‌లో బల్గేరియా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 36వ ర్యాంకర్‌ న్యుర్గుల్‌ సలీమోవా 62 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ హంపిపై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి ఈ టోరీ్నలో రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది.

ప్రపంచ మూడో ర్యాంకర్‌ అలెగ్జాండ్రా గొర్యాచ్‌కినా (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌ను వైశాలి 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్‌ విభాగం నాలుగో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. విదిత్‌ సంతోష్‌ గుజరాతి 44 ఎత్తుల్లో నిపోమ్‌నియాషి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. నకముర (అమెరికా)తో గేమ్‌ను ప్రజ్ఞానంద 24 ఎత్తుల్లో...ఫాబియానో కరువానా (అమెరికా)తో గేమ్‌ను గుకేశ్‌ 74 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు.

Advertisement
 
Advertisement
Advertisement