BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన కిదాంబి శ్రీకాంత్..

BWF World Championships 2021: Kidambi Srikanth Lost To Singapore Loh Kean Yew In Final - Sakshi

హుఎల్వా (స్పెయిన్): వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్‌ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 15వ సీడ్‌ శ్రీకాంత్‌ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్‌ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్‌ కెరీర్‌లో తొలి టైటిల్‌ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్‌ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు.

కాగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా యశ్‌ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top