టెస్టు సిరీస్‌కు బ్రూక్‌ దూరం  | Brook is away from the Test series | Sakshi
Sakshi News home page

టెస్టు సిరీస్‌కు బ్రూక్‌ దూరం 

Jan 22 2024 4:17 AM | Updated on Jan 22 2024 4:17 AM

Brook is away from the Test series - Sakshi

లండన్‌: భారత్‌తో గురువారం నుంచి మొదలయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. జట్టులో కీలకమైన మిడిలార్డర్‌ బ్యాటర్, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌ ఈ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.

వ్యక్తిగత కారణాలతో అతను జట్టును వదిలి వెళ్లాడని, సిరీస్‌ మొత్తానికి అతను అందుబాటులో ఉండడని ఇంగ్లండ్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. తొలి టెస్టు కోసం ఆదివారమే ఇంగ్లండ్‌ జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. బ్రూక్‌ స్థానంలో డాన్‌ లారెన్స్‌ను ఇంగ్లండ్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌ తరఫున 11 టెస్టులు ఆడిన లారెన్స్‌ 551 పరుగులు చేశాడు.   

Advertisement
 
Advertisement
Advertisement