ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజయం | Australia limp to two wicket win after Perry fiery fifty vs New Zealand | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజయం

Oct 18 2026 8:45 PM | Updated on Oct 18 2026 8:45 PM

Australia limp to two wicket win after Perry fiery fifty vs New Zealand

source: X

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా మహిళల జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎల్లీస్ పెర్రీ మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే, ఆమె ఔటైన తర్వాత ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరకు మరో ఏడు బంతులు మిగిలుండగానే ఆసీస్ లక్ష్యాన్ని అందుకుంది.

సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (85), మ్యాడీ గ్రీన్ (56 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 80 బంతుల్లోనే 127 పరుగులు జోడించింది. చివరి ఐదు ఓవర్లలో న్యూజిలాండ్ 54 పరుగులు సాధించింది.

అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ జార్జియా వాల్‌ డకౌటైంది. ఈ దశలో ఎల్లీస్ పెర్రీ (52), బెత్ మూనీ (38) ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అయితే పెర్రీ ఔటవడంతో మ్యాచ్  మలుపు తిరిగింది.

న్యూజిలాండ్ బౌలర్లు ఒక్కసారిగా పుంజుకున్నారు. జెస్ కెర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టింది. 102/3తో పటిష్టంగా కనిపించిన ఆసీస్ కెర్‌ ధాటికి 145/7కు చేరింది. అయితే చివర్లో కిమ్ గార్త్ బౌండరీ బాది ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. కాగా, న్యూజిలాండ్‌ జట్టు మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.

ఇదీ చదవండి: ప్రియాంశ్‌ ఆర్యకు గుండెకోత.. పరుగు తేడాతో డబుల్‌ సెంచరీ మిస్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement