Archery World Cup Stage 1: Indian Teams Poor Performance, Check Details - Sakshi
Sakshi News home page

Archery World Cup Stage 1: భారత జట్లకు నిరాశ 

Apr 20 2023 1:18 PM | Updated on Apr 20 2023 1:28 PM

Archery World Cup Stage 1: Indian Teams Poor Performance - Sakshi

అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నీలో కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత మహిళల, పురుషుల జట్లకు నిరాశ ఎదురైంది. మహిళల టీమ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అవ్‌నీత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. క్వాలిఫయింగ్‌లో టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన భారత జట్టుకు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ ఆడే అవకాశం లభించింది.

మాడిసన్‌ కాక్స్, డానిలె లుట్జ్, కాసిడి కాక్స్‌లతో కూడిన అమెరికా జట్టు 233–225 పాయింట్ల తేడాతో భారత జట్టును ఓడించింది. ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలె, రజత్‌ చౌహాన్, ప్రథమేశ్‌ సమాధాన్‌ జావ్కర్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు రెండో రౌండ్‌లో 234–236 పాయింట్ల తేడాతో చైనీస్‌ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది.    
 

Advertisement
 
Advertisement
Advertisement