అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తాం | - | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తాం

Published Wed, Nov 29 2023 4:36 AM | Last Updated on Wed, Nov 29 2023 4:36 AM

బోరబట్లలో మాట్లాడుతున్న సునీతా లక్ష్మారెడ్డి 
 - Sakshi

హత్నూర(సంగారెడ్డి): మళ్లీ అధికారంలోకి రాగానే పేదల అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇచ్చేందుకు కేసీఆర్‌ కార్యాచరణ రూపొందించారని నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హత్నూర మండలం బోరుపట్ల, రెడ్డి ఖానాపూర్‌, కాసాల, చందాపూర్‌, హత్నూర, నస్తీపూర్‌, మల్కాపూర్‌ తదితర గ్రామాలలో రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌ రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు విమర్శలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అన్నారు. కార్యక్రమంలో మెదక్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రగౌడ్‌, జెడ్పీటీసీ ఆంజనేయులు, దుర్గారెడ్డి, దామోదర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, పాల్గొన్నారు.

భారీ మెజార్టీతో గెలిపించాలి

కౌడిపల్లి(నర్సాపూర్‌): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి సునీతారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కోరారు. మంగళవారం ఆయన స్వగ్రామమైన కౌడిపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చడంతోపాటు సీసీ, బీటీ రోడ్లు వేసిందన్నారు. ఆసరా పింఛన్ల పెంపుతోపాటు రైతుబంధు, రైతుబీమా కల్పించినట్లు చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే రూ.400కు గ్యాస్‌ అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్‌, సర్పంచ్‌ వెంటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, శివాంజనేయులు, చిన్నంరెడ్డి, దుర్గారెడ్డి, నర్సింహారెడ్డి, శెట్టయ్య, దుర్గాగౌడ్‌, మల్లేశం పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరికలు

మండలంలోని సలాబత్‌పూర్‌ గ్రామ బీజేపీ అధ్యక్షుడు మనోహర్‌గౌడ్‌ మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సునీతారెడ్డి గెలుపుకోసం కృషి చేస్తామమని తెలిపారు. కార్యక్రమంలో మనోహర్‌రెడ్డి, సర్ధార్‌, పెంటయ్య పాల్గొన్నారు.

అత్త కోసం కోడలు..

వెల్దుర్తి(తూప్రాన్‌): ఉమ్మడి వెల్దుర్తి మండలంలోసునీతారెడ్డికి మద్దతుగా ఆమె కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించారు. కుమారుడు ఓ వైపు, కోడళ్లు మరోవైపు కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో భూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, నర్సింలు, శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశం, మల్లేశం, పాల్గొన్నారు.

నర్సాపూర్‌ రూరల్‌: ఎన్నికల ప్రచారం చివరి సమయంలో సునీతారెడ్డి పట్టణంలోని 15, 14, 8వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నయీమ్‌, అశోక్‌గౌడ్‌, పంబల్ల లలితా బిక్షపతి, సరిత, రామచందర్‌ పాల్గొన్నారు.

నర్సాపూర్‌: నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.సునీతారెడ్డి కోడలు రుత్వికారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆమె వెంట కౌన్సిలర్లు, నాయకులు అశోక్‌గౌడ్‌, సునీత, లలిత, సరిత, బాల్‌రెడ్డి, రవూఫ్‌, బిక్షపతి, మాణయ్య, రాకేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

శివ్వంపేట(నర్సాపూర్‌): బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతారెడ్డి గెలుపు కోసం ఆమె కోడలు రుత్వికారెడ్డి ప్రచారం నిర్వహించారు. చెన్నాపూర్‌లో ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. రాంచందర్‌గౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు
1/2

బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు

కౌడిపల్లిలో ప్రచారం చేస్తున్న మదన్‌రెడ్డి
2/2

కౌడిపల్లిలో ప్రచారం చేస్తున్న మదన్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement