బరువు తగ్గించే ఔషధాలతో కండరాల క్షీణత | Weight loss drugs can lead to muscle loss | Sakshi
Sakshi News home page

బరువు తగ్గించే ఔషధాలతో కండరాల క్షీణత

Nov 9 2024 4:58 AM | Updated on Nov 9 2024 4:58 AM

Weight loss drugs can lead to muscle loss

బరువు తగ్గేందుకు వినియోగించే ఔష­ధాల వల్ల కండ­రాల ద్రవ్యరాశి క్షీణించే ప్రమాదం ఉన్నట్లు ఓ అధ్య­య­నం వెల్లడించింది. మధుమే­హం, రక్తపోటు లాంటి జీవ­న శైలి వ్యాధులకు దారి తీసే ఊబకా­యా­న్ని నియంత్రి­ంచ­డ­ంలో ఈ మందులు సమర్థంగా పని చేస్తున్న­ప్పటికీ బరువు కోల్పో­యే ప్రక్రియలో కండ­రాలు క్షీణ­తకు గురయ్యే ముప్పు ఉన్నట్లు పరిశోధ­కు­లు చెబుతు­న్నారు.

బరు­వు కోల్పో­­వడం కారణంగా కండరాలు క్షీణ­తకు గురై­­న­ప్పుడు వార్దక్య లక్షణాలు, హృద్రోగ జబ్బుల ముప్పు పెరు­గు­తా­యి. ఈమేరకు పెన్నింగ్టన్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (అమె­రికా), ఆల్బ­ర్టా, మెక్‌ మాస్టర్‌ వర్సి­టీ (కెనడా)కి చెందిన పరిశో­ధకులు రూపొ­ం­దించిన పత్రాలు లాన్సెట్‌ జనరల్‌లో ప్రచురితమ­య్యాయి. – సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

కండరాలు ఎందుకు అవసరం?
⇒ దేహానికి పటుత్వం చేకూర్చి శరీరాన్ని దృఢంగా ఉంచడంతోపాటు జీవ క్రియలు, వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి.
⇒ శరీర కదలికలు, ఆకృతికి కండర కణజాలం అవసరం.

ఏం చేయాలి?
⇒ బరువు కోల్పోయేందుకు తీసుకునే మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
⇒ ఆహారం తక్కువ తీసుకుంటే విట­మి­న్లు, ఖనిజాలు తగిన మోతాదు­లో అందకపోయే ప్రమాదం ఉంది.
⇒ తగినంత ప్రోటీన్లు తీసుకోవడంతోపాటు వ్యాయామాలు లాంటి ఆరోగ్యకరమైన విధానాలను పాటించాలి.

బరువు తగ్గించే మందులు ఏం చేస్తాయి?
డయాబెటిక్‌ బాధితులు, బరువు కోల్పోయేందుకు తీసుకునే ఓజెమ్‌పిక్, వెగావై, మౌన్జరో, జెప్‌బౌండ్‌ లాంటి మందుల్లో జీఎల్‌పీ – 1 రిసెప్టార్‌­ఎగో­నిస్ట్‌­లు ఉంటాయి. ఒక రకమైన ప్రోటీ­న్లు లాంటి ఈ రిసెప్టార్లు రక్తంలో చక్కెర స్థాయిలు, జీవ క్రియలను నియ­ంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్‌ విడుదల­య్యేలా ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెంచే గ్లూకగాన్‌ హార్మోన్‌ విడు­ద­లను అడ్డుకుంటాయి. ఆహారం తీసు­కున్న తరువాత రక్తంలో చక్కెర స్థాయి­లను తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుంది.

ఆకలిని కూడా ఇవే రిసెప్టార్లు నియంత్రిస్తాయి. కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువును నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. ఈ రిసెప్టార్లను అనుక­రిస్తూ టైప్‌ 2 డయాబెటిస్, ఊబకా­యా­న్ని నియత్రించే ఔషధాలు తయార­య్యాయి. మధుమేహ నియంత్రణలో వాడే మరికొన్ని మందులు మూత్రం ద్వారా గ్లూకోజ్‌ను బయటకు పంపి శరీర బరువును సమతూకంలో ఉంచేలా దోహదం చేస్తాయి. ప్రధానంగా మెద­డులోని కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవ­డం ద్వారా ఆకలిని అణచివేసి తక్కువ తీసుకునేలా ప్రోత్సహిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement