ట్రాక్టర్‌ కింద పడి రైతు మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కింద పడి రైతు మృతి

Published Wed, Nov 22 2023 12:22 AM

- - Sakshi

తాళ్లూరు (ముండ్లమూరు): మండలంలోని తూర్పుగంగవరం గ్రామానికి చెందిన యాడిక చిన సుబ్బారెడ్డి (59) రైతు తన నడుపుతున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడటంతో దాని కింద మృతి చెందినట్లు ఏఎస్‌ఐ మోహనరావు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిన సుబ్బారెడ్డి సోమవారం తనకు గల పొలం దున్నేందుకు ట్రాక్టర్‌తో పొలం వెళ్లారు. పొలం దున్నిన అనంతరం సాయంత్రం ఇంటికి వెళ్తుంగా మార్గ మధ్యంలో ఎన్‌ఎస్‌పీ కాలువ కట్టపై పాము అడ్డు రావడంతో దానిని తప్పించబోయి అదుపు తప్పి ట్రాక్టర్‌ కాలువలో తిరగపడటంతో చిన సుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య యాడిక వెంకట లక్ష్మమ్మ, కుమారుడు ఉన్నారు.

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏఎస్‌ఐ మోహనరావు

Advertisement
 
Advertisement
 
Advertisement