ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని మూడు గొర్రెలు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని మూడు గొర్రెలు మృతి

Published Sat, Jul 29 2023 2:26 AM | Last Updated on Sat, Jul 29 2023 2:26 AM

సంఘటన స్థలంలో మృతిచెందిన గొర్రెలు  - Sakshi

పామూరు: రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో మూడు గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరో ఐదు గొర్రెలకు కాళ్లు, నడుములు విరిగిపోయాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం 565వ నంబర్‌ జాతీయ రహదారిపై పామూరు సీహెచ్‌సీ సమీపంలో చోటుచేసుకుంది. పామూరుకు చెందిన ఇర్రి శ్రీనివాసులరెడ్డికి చెందిన గొర్రెలు మేత కోసం వెళ్తున్నాయి. ఆ సమయంలో కాకినాడ నుంచి అన్నమయ్య జిల్లా తరిగొండకు డీజిల్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి గొర్రెలను ఢీకొట్టింది. కొన్ని గొర్రెలను ఈడ్చుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో మూడు గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదు గొర్రెలకు కాళ్లు, నడుములు విరిగాయి. విద్యుత్‌ స్తంభం కూడా విరిగి కిందపడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మృతిచెందిన, గాయపడిన గొర్రెల విలువ సుమారు రూ.1.10 లక్షల వరకూ ఉంటుందని యజమాని తెలిపారు. కాగా, గొర్రెలే అకస్మాత్తుగా అడ్డొచ్చాయని ట్యాంకర్‌ డ్రైవర్‌ జి.సురేంద్ర తెలిపారు.

మరో ఐదు గొర్రెలకు విరిగిన కాళ్లు, నడుములు

విరిగిపడిన విద్యుత్‌ స్తంభం

రూ.1.10 లక్షల నష్టం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement