చంద్రబాబుకి ఆ గేటు తెరిచే ఉద్దేశం లేదేమో! | Vellampalli Srinivas Satirical Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి ఆ గేటు తెరిచే ఉద్దేశం లేదేమో!

Jan 4 2024 3:39 PM | Updated on Jan 30 2024 2:34 PM

Vellampalli Srinivas Satirical Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ‘‘గేట్లు ఓపెన్‌ చేస్తే వైఎస్సార్‌సీపీ నేతలంతా టీడీపీలోకి వస్తారని గతంలో చంద్రబాబు అన్నారు.. మరి ఇప్పటివరకు ఎందుకు ఆ గేట్లు తెరవలేదు.. బహుశా చంద్రబాబుకి ఆ గేట్లు తెరిచే ఉద్దేశం లేదేమో!’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సెటైర్లు వేశారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నియోజకవర్గం మారాలంటే కొంత బాధగానే ఉంది. కానీ.. పార్టీ నిర్ణయం కోసం కట్టుబడి ఉంటా. సీఎం జగన్‌ సెంట్రల్‌ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్‌లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తాం’’ అని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు.

‘‘సామాజిక సమీకరణాల్లో భాగంగానే మార్పులు. వెస్ట్‌ నుంచి మైనారిటీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ నిర్ణయించింది. వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేర్వేరుగా లేవు.. అంతా వైఎస్సార్‌సీపీ వర్గమే. ఏ పార్టీలో చేరాలన్నది షర్మిల ఇష్టం. ఆమె ఏం మాట్లాడతారో చూడాలి’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్‌.. కాంగ్రెస్‌ యాక్షన్‌


 

Advertisement
 
Advertisement
Advertisement