పెరిగిన నితీశ్‌ ఇమేజ్‌.. పాట్నాలో ‘టైగర్‌ జిందాహై’ పోస్టర్లు JD(U) Party workers displayed a large poster featuring Nitish Kumar with the words Tiger Zinda Hai. Sakshi
Sakshi News home page

పెరిగిన నితీశ్‌ ఇమేజ్‌.. పాట్నాలో ‘టైగర్‌ జిందాహై’ పోస్టర్లు

Published Sat, Jun 8 2024 11:45 AM | Last Updated on Sat, Jun 8 2024 12:08 PM

Tiger Zinda Hai Posters On Nitish Kumar In Patna

పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో  జేడీయూ అద్భుత ప్రదర్శన తర్వాత ఆ పార్టీ చీఫ్‌, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఇమేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.  ఎన్డీఏ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలకంగా మారడం ఆ పార్టీ క్యాడర్‌కు ఉత్సాహాన్నిస్తోంది. 

ఇందులో భాగంగానే బిహార్‌ రాజధాని పాట్నాలోని మెయిన్‌ సెంటర్‌లో  ఆ పార్టీ కార్యకర్తలు టైగర్‌ జిందాహై అని పెద్ద హోర్డింగ్‌ పెట్టారు. ఈ పోస్టర్‌పై పులి బొమ్మతో పాటు నితీశ్‌కుమార్‌ భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాకుండా పట్టణంలోని పలు చోట్ల నితీశ్‌ను కీర్తిస్తూ పెద్ద పెద్ద పోస్టర్‌లు, ఫ్లెక్సీలు పెట్టారు.

‘ఫలితాలకు ముందు నితీశ్‌ ఇమేజ్‌ ఫలితాల తర్వాత నితీశ్‌ ఇమేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. బిహార్‌ ఓటర్లలో నితీశ్‌ పాపులారిటీ పెరిగింది’అని జేడీయూ నేత నీరజ్‌కుమార్‌ చెప్పారు.

కాగా, మోదీ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలక మంత్రిత్వ శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బిహార్‌కు ప్రత్యేక హోదా, అగ్నివీర్‌ స్కీమ్‌లో మార్పుల కోసం జేడీయూ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement