సీఎం విజయ్‌తో చేతులు కలుపుతా.. | PM Modi Pledges To Work With Tamil Nadu CM Vijay To Accelerate State’s Development And Create Jobs For Youth | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌తో చేతులు కలుపుతా..

Oct 12 2026 12:51 PM | Updated on Oct 12 2026 1:49 PM

PM Modi pledges to work for Tamil Nadu's development

సాక్షి, చెన్నై:  తమిళనాడు అభివృద్ధి ప్రస్థానానికి నాయకత్వం వహించేందుకు సీఎం విజయ్‌తో చేతులు కలుపుతాననని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తమిళనాడులో ప్రభుత్వాలు మారుతూ వచ్చినా, తమిళనాడు అభివృద్ధి, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తాజాగా కూడా అదే సంకల్పంతో సీఎం  విజయ్‌తో కలిసి తమిళనాడు అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని ప్రకటించారు. ఐఐటీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

‘‘ఈ రోజు మన దేశానికి, తమిళనాడుకు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళనాడు యువతకు వివిధ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. పవిత్రమైన నవరాత్రి పండుగ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది’’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ పవిత్రమైన రోజున, శివుని శక్తి పీఠం కొలువై ఉన్న తమిళనాడులో తాను ఉన్నానని, ఈ పుణ్యక్షేత్రమైన తమిళనాడు నుండి, దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రకటించారు. తనకు ఐఐటి మద్రాస్‌లోని బ్రెయిన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను సందర్శించే అవకాశం లభించిందని, ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు ప్రజారోగ్య రంగంలో కొత్త అవకాశాలనుసృష్టిస్తాయన్నారు. అలాగే,  చెన్నై మెట్రోలో మరో విస్తరణను ప్రారంభించే అవకాశం తనకు లభించిందన్నారు. 

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరుణానిధి, జయలలితలతో చాలాసార్లు సంభాషించే అవకాశం లభించిందన్నారు. ప్రధానమంత్రి అయ్యాక, జయలలిత, ఓపీఎస్, పళనిస్వామి, స్టాలిన్‌ వంటి వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికిందన్నారు. ప్రభుత్వాలు మారుతూ వచ్చినా, తమిళనాడు అభివృద్ధి, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉన్నాయన్నారు. తాజాగా అదే సంకల్పంతో, సీఎం విజయ్‌తో కలిసి తమిళనాడు అభివృద్ధి యాత్రను ముందుకు తీసుకువెళ్తున్నట్టు తెలిపారు.   

ఇదీ చదవండి: జ్ఞానేశ్‌పై మరో అస్త్రంతో ఇండియా కూటమి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement