తప్పుడు ప్రచారం మానుకోండి.. బీఆర్‌ఎస్‌, బీజేపీపై మంత్రి శ్రీధర్‌ బాబు ఫైర్‌ | Minister Sridhar Babu Political Counter To BRS And BJP | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారం మానుకోండి.. బీఆర్‌ఎస్‌, బీజేపీపై మంత్రి శ్రీధర్‌ బాబు ఫైర్‌

Jul 19 2024 5:13 PM | Updated on Jul 19 2024 5:39 PM

Minister Sridhar Babu Political Counter To BRS And BJP

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో​ ప్రతిపక్ష పార్టీ నేతలపై మంత్రి శ్రీధర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేయలేని పని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారని కామెంట్స్‌ చేశారు.

కాగా, మంత్రి శ్రీధర్‌ బాబు కరీంనగర్‌ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. ఇప్పటికైనా రైతుల్లో అయోమయం సృష్టించడం మానేసి మా నుంచి మీరు నేర్చుకోంది. మీరు చేయలేని పనులు మేము చేస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మా పార్టీ సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హౌసింగ్‌ జీవోపైనా ఇష్టానుసారం మాట్లాడారు’ అంటూ సీరియస్‌ అయ్యారు.

ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కుంగుబాటుపై మంత్రి శ్రీధర్‌ బాబు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నెర్రెలు వాచిన కథ మనం చూశాం. మళ్లీ కుంగుతున్నట్టు ప్రజలు చెబితేనే మాకు తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరంపై విచారణ కమిషన్‌ పనిచేస్తోంది. మిగతా ఇంకా ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement