ప్రాంతీయతపై కేటీఆర్‌కు పొన్నం కౌంటర్‌ | Minister Ponnam Prabhakar Counter To Ktr | Sakshi
Sakshi News home page

‘మాది నియంతృత్వం కాదు’: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్‌

Sep 14 2024 12:34 PM | Updated on Sep 14 2024 3:39 PM

Minister Ponnam Prabhakar Counter To Ktr

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు రవాణా శాఖ, హైదరాబాద్‌ ఇంఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(సెప్టెంబర్‌14) కౌశిక్‌రెడ్డి ఇంట్లో మీడియాతో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు.

‘ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ సభ్యులు కాదా.హైదరాబాద్ లో నివసించే వారిని ఏనాడూ కాంగ్రెస్ విమర్శించలేదు. అత్యంత దారుణంగా ఆంధ్రా ప్రజలను విమర్శించింది కేసీఆర్‌ కాదా.బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేత గాంధీనే చెప్తున్నారు.ప్రాంతీయతను రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వంలా నియంతృత్వ పోకడలకు మేం పోవడం లేదు.గాంధీ,కౌశిక్ చేసింది తప్పే.కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం కరెక్టా.భౌతిక దాడులు మంచివి కావు’అని పొన్నం అన్నారు. 

పొన్నం వార్నింగ్

ఇదీ చదవండి.. కౌశిక్‌రెడ్డిపై దాడి వెనుక పోలీసులు: కేటీఆర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement