నా హత్యకు కుట్ర పన్నారు: కౌశిక్‌ రెడ్డి | kaushik reddy reacts on arekapudi gandhi cadre attack on his home | Sakshi
Sakshi News home page

నా హత్యకు కుట్ర పన్నారు: దాడిపై ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి

Sep 12 2024 1:13 PM | Updated on Sep 12 2024 1:55 PM

kaushik reddy reacts on arekapudi gandhi cadre attack on his home

హైదరాబాద్‌, సాక్షి: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఆహ్వానిస్తే.. ఆయన తన గూండాలను తనపైకి పంపించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మండిపడ్డారు. ఇది తన హత్యాయత్నం కుట్రలో భాగంగా జరిగిన దాడేనని ఆరోపించారాయన. 

‘‘గూండాలు వచ్చి దాడి చేయడం కరెక్టేనా?. కట్టెలు, కర్రలతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రీ ప్లాన్డ్‌గా దాడి చేశారు. తెలంగాణలో లా అండ్‌ ఆర్డ్‌ ఉందా?. ఒక  ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటి? కచ్చితంగా దాడికి ప్రతిదాడి ఉంటుంది. రేపు వాళ్ల సంగతి తేలుస్తా’ అని అన్నారు.

కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ అనుచరులు  కౌశిక్‌ ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశి​క్‌ ఇంటిపై గాంధీ అనుచరులు రాళ్లు విసిరారు. ఈక్రమంలో ఇరు వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. ఒక దశలో ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేయలేకపోయారు.

చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి.. బలవంతంగా అరికెపూడి తరలింపు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement