తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు.. మంత్రి కారుమూరి ఫైర్‌

Karumuri Nageswara Rao Serious Comments On TDP Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ పేదలను మోసం చేసే కార్యక్రమం చేపట్టారు. మరో కపట నాటకానికి నయవంచకుడు రెడీ అయ్యాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

కాగా, మంత్రి కారుమూరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసుకున్నది 420 బర్త్‌ డే. తానే ఇంద్రుడు, చంద్రుడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. 600 వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. ప్రభుత్వ పాఠాశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తెస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు. మరో కపట నాటకానికి నయవంచకుడు రెడీ అయ్యాడు. తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు. తోడబుట్టినవాడిని గదిలో బంధించిన వ్యక్తి చంద్రబాబు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. వంగావీటి రంగా, మల్లెల బాబ్జీ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు. త్వరలోనే చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’ అని అన్నారు.

మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

బాబు పేదల పేరెత్తడం ఒక వింత
చంద్రబాబు, తన పుట్టినరోజు సందర్భంగా కూడా నిజాలు మాట్లాడటం లేదు.  420 మాటలే మాట్లాడాడు. ఎప్పుడూ లేనిది ఆయనకు హఠాత్తుగా పేదలు గుర్తొచ్చారు. పేదల పెన్నిధిని తానే అని అంటున్నాడు. పేదలకు ఏనాడూ మంచి చేయనివాడు, పేదలు అనే మాటే పలకటానికి ఇష్టపడనివాడు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తే పేదలు సోమరులవుతారు.. అని తన మనసులో మాటలో చెప్పుకున్నవాడు.. పేదల గురించి మాట్లాడటం ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఉంది. మార్కాపురం సభలో  చంద్రబాబు పేదల గురించి మాట్లాడుతుంటే.. మాయల బాబుకు మాయదారి రోగమేమైనా వచ్చిందా.. ఏంటి..? అని ప్రజలంతా ఆశ్చర్యపోయారు.  

నయవంచనకు కేరాఫ్‌ చంద్రబాబు
చంద్రబాబు రాజకీయ అనుభవమంతా కుట్రలు, కుతంత్రాలే. ఆయన  ప్రజల్లో నుంచి ఎదిగిన నాయకుడు కాదు. అధికారాన్ని ఉన్నపళంగా లాక్కోవడానికి గుంటనక్కలా మాటేసి, వేటేసే నయవంచకుడు చంద్రబాబు. ఆనాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన్ను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసి మరీ టీడీపీని, సైకిల్‌ గుర్తును, ఎన్టీఆర్ ట్రస్టు ఆస్తులను లాగేసుకున్న దుర్మార్గుడు. అందుకే, ఆయన్ను రాజకీయాల్లో నయవంచనకు కేరాఫ్‌ అడ్రస్  అని అందరూ పిలుస్తారు. 

బాబు వస్తే.. నాడు జాబులు ఏమయ్యాయి..?
 ఎన్నికలొచ్చిన ప్రతీసారి మాయమాటలు చెప్పడం.. ప్రజల్ని ఏమార్చడం,  నమ్మించడం.. అధికారంలోకి రాగానే వారందర్నీ వంచించడం.. ఇదే చంద్రబాబు నేర్చిన రాజకీయమనేది జగమెరిగిన సత్యం. కిందటిసారి అధికారంలోకి వచ్చేటప్పుడు..‘బాబు వస్తేనే జాబు వస్తుంది’ అంటూ రాతలు రాయించి గోడలన్నింటినీ ఖరాబు చేశాడు. అధికారంలోకి రాగానే ‘బాబు వచ్చాడు గానీ జాబులు మాత్రం రాలేదు’ అని ప్రజలు వాపోయారు. ఇప్పుడు పేదలు, అభివృద్ధి అనే మాటలతో ప్రజల్ని మరోసారి మభ్యపెట్టాలని చూస్తున్నాడు.  బాబు కపటనాటకాలను జనం ఏనాడో గుర్తించారు కనుకనే 2019 ఎన్నికల్లో ఆయన్ను ఘోరంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. 

రుణ మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలు, రైతుల్ని దగా చేసిన బాబు
డ్వాక్రా సంఘాలను తానే పెట్టానని, తనకు మహిళలంటే చాలా గౌరవమంటూ.. వారిని తన హయాంలో సంతోషంగా చూసుకున్నానంటూ చంద్రబాబు..  కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారం మీరు తెచ్చుకోవద్దు.. నేను మీ రుణాలన్నింటినీ మాఫీ చేసి మీ బంగారాన్ని మీ ఇంటికే తెచ్చి ఇస్తానని మాయమాటలు చెప్పి డ్వాక్రామహిళల్ని మోసం చేశాడు. రుణమాఫీ పేరిట రైతుల నెత్తినటోపీ పెట్టిన ఘనుడు ఈ చంద్రబాబు. రైతుల రుణాల్ని రూ.87వేల కోట్లను కాస్తా కేవలం రూ.24వేల కోట్లకు కుదించి, 15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి, మిగతాది ఎగొట్టిన నీచుడు ఈ చంద్రబాబు. పైగా, ఈ విషయంపై విలేకరులు ఆనాడు నిలదీస్తే ‘ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తారా..? రైతుల అప్పులన్నీ ప్రభుత్వమే తీర్చాలా..? వాళ్లేం కట్టుకోరా..? ’ అంటూ అడ్డగోలు సమాధానమిచ్చి బెదిరించాడు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 600కు పైగా హామీల్నిచ్చి, ఏరుదాటాక తెప్పతగిలేసిన నీచుడు ఈ చంద్రబాబు అని మరోమారు గుర్తుచేస్తున్నాను. 

తల్లికి కొరివి పెట్టలేని దౌర్భాగ్యుడు
 చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ చనిపోయినప్పుడు ఆమెకు కొడుకుగా  తలకొరివి పెట్టలేని దౌర్భాగ్యుడు అతడు. తలకొరివి పెట్టి కర్మ చేస్తే తన రాజకీయాలు నడపడానికి సమయం ఉండదనే నీచమైన ఆలోచనకు దిగజారిన వ్యక్తి ఈ చంద్రబాబు అని అటు నారా కుటుంబంలోనూ, ఇటు నందమూరి కుటుంబంలోనూ ఆనాడు అందరూ అనుకున్నదే. మరి, ఆరోజు తమ్ముడుతో తలకొరివి పెట్టించిన బాబు.. అదే తమ్ముడికి ఆరోగ్యం బాగోలేకపోతే, గదిలో నిర్భంధించి, ఏనాడూ ఆయన మొఖం చూసిన పాపానపోలేదు. కుటుంబ విలువల్లేని వ్యక్తి చంద్రబాబు. ఏదోరోజుకు అతని భార్య, కొడుకు కూడా ‘వీడు పెద్ద శాడిస్టు’ అని ఈసడించుకునే సమయమొస్తుంది. 

జగన్‌ పేరేత్తే అర్హతే లేదు
సమాజంలోనూ, రాజకీయాల్లోనూ విలువల్లేని వ్యక్తిగా ముద్రపడ్డ చంద్రబాబుకు, మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరేత్తే అర్హతే లేదు. ఎందుకంటే, మా జగన్‌గారు తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని ఎంత ప్రేమగానైతే చూసుకుంటారో.. అంతే ప్రేమగా రాష్ట్రప్రజల్ని కాపాడుకుంటూ రాజకీయాల్లో ఎదుగుతున్న వ్యక్తి. అలాంటి మా నాయకుడిపై నిందలు మోపడం, కారుకూతలు కూయడం సరికాదు. ఎల్లో మీడియా తప్పుడు రాతలను, చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదు. 

హత్యా రాజకీయాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య
 ఈమధ్యన పర్యటనల్లో చంద్రబాబు ఎక్కడికెళ్లినా కులాలు, మతాల్ని రెచ్చగొడుతూ.. బూతులు మాట్లాడుతూ దిగజారి ప్రవర్తిస్తున్నాడు. 2019 ఎన్నికల్లో  ఏరోజైతే బాబు అధికారం నుంచి దిగిపోయాడో.. ఆనాడే ఏపీకి పట్టిన దరిద్రం వదిలిపోయిందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు మళ్లీ మాయమాటలు, కుట్రరాజకీయాలకు ఆయన బరితెగిస్తున్నాడు. నాడు వంగవీటి మోహనరంగాను బాబే హత్యచేయించారని హరిరామజోగయ్య  చెప్పిన సంగతిని గుర్తుచేస్తున్నాను.  అదేవిధంగా ప్రజాదరణలో ముందుకెళ్తున్న మా నాయకుడు వైఎస్‌ జగన్‌ గారిని ఏయిర్‌పోర్టులో కోడికి కట్టే కత్తితో హత్యాయత్నానికి ప్లాన్‌ చేశారు. అప్పట్లో ఆ కత్తి భుజానికి తగిలింది కాబట్టి సరిపోయింది. అదే మెడపై తగిలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో అందరూ ఆలోచించాలి. అదేమాదిరిగానే బాబు అధికారంలో ఉండగానే వైఎస్‌ వివేకానందరెడ్డి గారు హత్యకు గురయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ చంద్రబాబును ఎందుకు  విచారణకు పిలవలేదు. ఈకేసులో  టీడీపీ నాయకుల ప్రమేయం కూడా ఉందనేది మా అనుమానం. ఎందుకంటే, హత్యారాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తలపండిన రాజకీయ నేతలే చెబుతున్నారు. 

పేదోళ్ల పెద్దబిడ్డ జగన్
రాష్ట్రమంతా గడప గడపకు మన ప్రభుత్వంతో పాటు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాలతో మేం ఇంటింటికీ తిరిగినప్పుడు అన్నిచోట్లా వినిపిస్తున్న నినాదం ఒకటే.. ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ అని కోరుకుంటున్నారు.  బాబు అధికారంలో ఉండగా, చేయలేని అభివృద్ధి, సంక్షేమాన్ని పేదలకు అందిస్తుంటే.. మా జగన్‌ గారు  పేదకుటుంబాలకు ఇంటికి పెద్దబిడ్డగా కనిపిస్తుంటే..  చంద్రబాబు, లోకేశ్‌లకు మాత్రం ఆయన సైకోగా కనిపిస్తున్నాడట. మీలాంటి దుర్మార్గులకు, దుష్టులకు, దోపిడీదారులకు, దుష్ట చతుష్టయానికి.. దేవుడు కూడా దయ్యంలానే కనిపిస్తాడు. మీరెన్ని కుట్రలు చేసినా, పేదల సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూసినా,  మా నాయకుడు మంచి చేయడం కోసం పోరాడే విషయంలో వెనుకాముందు చూసుకోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే వ్యక్తి అని ఈరోజు అందరూ అంగీకరిస్తున్నారు. 

ఆనాడు పాదయాత్రలో జనం గురించి ఆలోచించి ఏదైతే చెప్పారో.. దాన్ని తూచ తప్పకుండా అమలుచేసిన నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్‌ గారు. ఈరోజు పేదకుటుంబాలకు అవినీతికి తావులేకుండా ఒక కొడుకు, అన్నలా, మేన మామలా అన్నీరకాలుగా ఆదుకుంటున్న గొప్ప పరిపాలకుడుగా పేరుతెచ్చుకున్నారు. కరోనా వంటి సంక్షోభంలో కూడా నవరత్నాలు అమలు చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రిగారికే దక్కుతుంది.

బాబు హయాంలో 14వ స్థానంలో ఉన్న విద్యారంగాన్ని నేడు మేం మూడోస్థానంలోకి తెచ్చాం. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దన్న చంద్రబాబు ఈరోజు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఏ పిల్లాడ్ని కదిలించినా ఇంగ్లీషులో మాట్లాడటాన్ని చూస్తే నివ్వేరపోతాడు. 
అదే బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం 45వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అదే మా జగన్‌ సీఎంగా రాగానే 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాల పాటు ఇతర ప్రభుత్వశాఖల్లో ఖాళీలను భర్తీ చేయడంలో ముందున్నాం. సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు వస్తున్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక బాబు ఈర్ష్య పడుతున్నాడు కనుకనే, ఆయన ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాడు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ పేరుతో చేసిన కుంభకోణం బాబుకు మెడకు చుట్టుకుని త్వరలో జైలుకెళ్లే సమయం కూడా దగ్గరలో పడింది. 

మైకు పట్టుకోలేని ముసలి నక్క చంద్రబాబు
ఈరోజు పర్యటనల్లో తండ్రీకొడుకులు(బాబు, లోకేశ్‌) నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు. మా నాన్న అధికారంలోకి వచ్చే వరకు అరటికాయలు కూడా దొరికేవి కాదని, ప్రజలంతా ఆకులు, అలమలు తిని బతికినట్టు పాదయాత్రలో లోకేశ్ చెబుతుంటే.. చంద్రబాబేమో, తానే సెల్‌ఫోన్‌ను కనిపెట్టానని, నా వల్లే విదేశాలకు వెళుతున్నారంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. బైపాస్‌రోడ్లు కూడా తానే వేశానని బాబు చెప్పుకోవడం దుర్మార్గం. బాబు గతంలో చేసిన దుర్మార్గాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. ప్రజలందరికీ ఆయన కపటనాటకాలు తెలిసిపోయాయి.

అందుకే, ఈరోజు రాష్ట్రమంతా మళ్లీ జగనన్నే రావాలని కోరుకుంటున్నారు. బాబును మాత్రం ప్రజలు చీదరించుకుంటున్నారు. కరడుగట్టిన టీడీపీ కుటుంబాలే మాకు నవరత్నాలు అందాయని చెబుతున్నారు. ‘బాబూ.. నువ్వు ముసలినక్కవై పోయావు. కనీసం మైకు పట్టుకుని శక్తి కూడా నీకు లేదు. ఈ వయసులో కూడా ఇంకా దోచుకుని దాచుకోవాలన్న నీ కుట్రల్ని ప్రజలు భగ్నం చేస్తారు. నీ పక్కనున్న పార్టీ నేత అచ్చెన్నాయుడు పార్టీలేదు. బొక్కా లేదు అన్నప్పుడే నీ పార్టీ కేడర్‌రంతా టీడీపీని వదిలేశారు.’. మీరెన్ని కుట్రలు చేసినా అధికారంలోకి రావడం కల్ల అన్నది బాబు గుర్తెరగాలి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top