కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ | BRS Rajendranagar MLA Prakash Goud Joined In Congress Party, See Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌

Jul 12 2024 7:16 PM | Updated on Jul 12 2024 7:42 PM

BRS MLA Prakash Goud Join In Congress

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ గూటికి చేరారు. సీఎం రేవంత్‌ సమక్షంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరిపోయారు. దీంతో, కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంఖ్య ఎనిమిదికి చేరింది.

కాగా, రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, తాజాగా ప్రకాశ్‌ గౌడ్‌ చేరికతో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మరోవైపు.. రేపు మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement